Wed Dec 17 2025 14:12:55 GMT+0000 (Coordinated Universal Time)
మూడేళ్ల పాలనలో అంతా ముంచుడే
మూడేళ్ల వైసీపీ పాలనలో అన్నీ వైఫల్యాలేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు

మూడేళ్ల వైసీపీ పాలనలో అన్నీ వైఫల్యాలేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. 33 నెలల వైసీపీ పాలనలో ఏపీలో నిర్మాణరంగం కుదేలైపోయిందని దేవినేని ఉమ ట్వీట్ చేశారు. ఇనుము, సిమెంటు, ఇటుక, ఇసుక ధరలు రెట్టింపు కావడంతో నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయాన్నారు.
భవన నిర్మాణ రంగం....
ఇక విద్యుత్తు కోతలతో సిమెంట్, స్టీల్ ఉత్పత్తి తగ్గిందని, అందుకే ధరలు పెరిగాయని ఆ కంపెనీలు చెబుతున్నాయని దేవినేని ఉమ అన్నారు. ఇసుక అందుబాటులో లేకపోవడంతో భవననిర్మాణ రంగం సంక్షోభంలో పడిందని దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. వైసీపీ నేతల దోపిడీ, అసమర్ధత కారణంగానే నిర్మాణ రంగం పూర్తిగా సంక్షోభంలో పడిందని దేవినేని ఉమ అన్నారు.
- Tags
- devineni uma
- tdp
Next Story

