Thu Feb 02 2023 00:44:54 GMT+0000 (Coordinated Universal Time)
పేర్లు మార్చడమే.. ప్రాజెక్టులు కట్టిందెక్కడ?
రాష్ట్రంలో చంద్రబాబు పూర్తి చేసిన ప్రాజెక్టులను జగన్ ప్రారంభిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు

రాష్ట్రంలో చంద్రబాబు పూర్తి చేసిన ప్రాజెక్టులను జగన్ ప్రారంభిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ, నిర్మాణాలను ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుందని ఆయన ట్వీట్ చేశారు. సంగం బ్యారేజీ పనులను టీడీపీ అధినేత చంద్రబాబు 82 శాతానికి పైగా పూర్తి చేశారన్నారు.
సంగం ప్రాజెక్టును...
వైసీపీ ప్రభుత్వం మాత్రం నలభై నెలలో 10 శాతం పనులు కూడా చేయకుండా రిబ్బన్ కటింగ్ చేశారని దేవినేని ఉమ సెటైర్ వేశారు. సంగం ప్రాజెక్టు పేరును మార్చడం తప్ప ఏం చేశారని ఆయన నిలదీశారు. ఎవరి హయాంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పే ధైర్యం సీఎం జగన్ కు ఉందా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
Next Story