Fri Mar 20 2026 04:59:54 GMT+0530 (India Standard Time)
YSRCP : వైసీపీకి మరో కీలక నేత రాజీనామా
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాచేశారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాచేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకువైఎస్ జగన్ కు రాసిన రాజీనామా లేఖలో బాలినేని పేర్కొన్నారు. బాలినేని శ్రీనివాసులు రెడ్డి గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. అధినాయకత్వంలో ఆయన ను రాజీనామా చేయవద్దని నేతలు బతిమాలినా వినలేదు. జగన్ కు దగ్గర బంధువు అయిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి పార్టీని వీడటంతో ప్రకాశం జిల్లాలో వైసీపీకి కొంత దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు వాదనగా ఉంది.
గత కొంత కాలంగా...
బాలినేని శ్రీనివాసులు రెడ్డి పార్టీని వీడతారని గతకొంత కాలంగా పార్టీని వీడతారన్న ప్రచారం జరుగుతుంది. 2024 ఎన్నికల్లో ఓటమి పాలయిన దగ్గర నుంచి బాలినేని అధినాయకత్వం, ముఖ్యంగా జగన్ పై అసహనంగా ఉన్న బాలినేని చివరకు పార్టీని వీడారు. ఈవీఎంలపై తన పోరాటానికి పార్టీ హైకమాండ్ సహకరించలేదని ఆయన సన్నిహితుల వద్ద వాపోయారు. జగన్ తో గంట సేపు సమావేశమయినా కొద్దిసేపటి క్రితం ఆయన పార్టీని వీడటం జగన్ కు షాకిచ్చే అంశమే.
Next Story

