Sun Mar 15 2026 11:33:22 GMT+0530 (India Standard Time)
మళ్లీ చెబుతున్నా... రాసిపెట్టుకోండి
తాను వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు

తాను వచ్చే ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. రాసుకోవాలని సూచించారు. టీబంకుల వద్ద మాట్లాడుకునే వారందరికీ తాను ఇదే చెబుతున్నానని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ గీసిన గీత దాటే ప్రసక్తి లేదని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
ఎవరికీ తలవంచను...
మళ్లీ చెబుతున్నానని, రాష్ట్రంలో అనిల్ కుమార్ యాదవ్ ఎవరికైనా తలవంచుతాడని అంటే కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమేనని అన్నారు. ఇంకొకరి ముందు తలవంచే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. బయట మాట్లాడే వారి గురించి తాను ఎప్పుడూ పట్టించుకోనని తెలిపారు.
Next Story

