Fri Dec 05 2025 14:58:04 GMT+0000 (Coordinated Universal Time)
Nellore : నెల్లూరు నుంచి మళ్లీ నేనే
నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు

నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. దమ్ము, ధైర్యం తనకు ఉందని ఆయన అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వాళ్లలా ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోనని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మళ్లీ నారాయణను ఓడిస్తానని అని అన్నారు. తాను ఇక్కడే ఉంటానని, వేరేవాళ్లు ఇక్కడకు రావాల్సిందేనని ఆయన తెలిపారు.
పక్క నియోజకవర్గం నుంచి...
వాళ్లలా పక్క నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తాను అనర్హుడిని కానని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. తాను కనిగిరి, కందుకూరు నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్నట్లు ప్రచారం చేస్తున్నారన్న అనిల్ కుమార్ యాదవ్ అలాంటి వార్తలను ఎవరూ నమ్మవద్దని అన్నారు. తాను పోటీకి దూరంగానైనా ఉంటాను తప్పించి పోటీ చేస్తే నెల్లూరు నుంచి పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
Next Story

