Wed Jan 28 2026 23:36:17 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : రెడ్ బుక్ రాజ్యాంగం మేరకే ఈ దాడులు
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు

ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అంబేద్కర్ స్మృతివనంపై దాడిచేసి జగన్ పేరును శిలాఫలకం నుంచి తొలగించే ప్రయత్నం చేశారన్నారు. లోకేష్, చంద్రబాబు ప్రమేయంతోనే అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందన్నారు. అంబేద్కర్ స్మృతివనంపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు.
లా అండ్ ఆర్డర్...
ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని అంబటి రాంబాబు అన్నారు. దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు అదుపు తప్పాయని, కిడ్నాప్, హత్యలతో అధికార పార్టీ నేతలు చెలరేగిపోతున్నారని అంబటి రాంబాబు అన్నారు. పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story

