Fri Dec 05 2025 13:38:38 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : చంద్రబాబును మించిన క్రిమినల్ పాలిటిక్స్ లో ఎవరున్నారు?
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మిధున్ రెడ్డిని అరెస్ట్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మిధున్ రెడ్డిని అరెస్ట్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష తీర్చుకోవడానికే ఈ అరెస్ట్ లని అన్నారు. చంద్రబాబు నాయుడు కంటే క్రిమినల్ ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్నారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు తొలి నుంచి తడిగుడ్డతో గొంతులు కోసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. లిక్కర్ లో స్కామ్ లేదని, మద్యం కుంభకోణం జరిగింది 2014 నుంచి 2019 వరకూ జరిగిందన్నారు.
సిట్ ఎవరి పేర్లు అడిగితే...
సిట్ ఎవరి పేర్లు అడిగితే వారి పేర్లు చెప్పాలా? అని అంబటి రాంబాబు నిలదీశారు.జగన్ సన్నిహితులుగా ఉంటున్న వారిపై కేసులుపెడుతున్నారని అంబటిరాంబాబు ఆరోపించారు. ఇప్పుడు నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నారని, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులేనని అన్నారు. కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగానే కేసులు పెడుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. ఎంత మందిపైన కేసులు పెట్టి అరెస్ట్ చేసినా వైసీపీ నేతలు భయపడే ప్రసక్తి లేదన్నారు. ఇంతమందిని అరెస్ట్ చేసి చంద్రబాబు ఏం సాధించారంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.
Next Story

