Thu Dec 18 2025 17:55:50 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : 31 వేల కోట్లు అప్పు చేసి రాజధాని నిర్మాణమా?
రాజధాని పేరుతో 31 వేల కోట్లరూపాయలను అప్పులు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

రాజధాని పేరుతో 31 వేల కోట్లరూపాయలను అప్పులు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు అప్పులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి మరీ చంద్రబాబు దోచుకుతింటున్నారని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు కేవలం అమరావతి కోసమే అప్పలు చేస్తున్నారని, సంక్షేమ పథకాలకు మాత్రం డబ్బులు లేవంటూ చేతులు విదిలిస్తూ పేదపలుకులు పలుకుతున్నారని అంబటి ఆరోపించారు.
ఉద్యోగాలను తీసివేస్తూ...
చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగాలను తీసివేస్తుందన్నారు.ఉన్న ఉద్యోగులను తీసివేస్తున్నారని, ఉన్నవారిని పీకేశారని అన్నారు. వాలంటీర్లను ఇంటికి పంపించారని, ఇప్పుడు ఫైబర్ నెట్ లో వందల సంఖ్యలో ఉద్యోగస్థులను ఇంటికిపంపించారని, ఇది రాజకీయకక్ష కాక మరేంటని అంబటిరాంబాబు ప్రశ్నించారు.ఉద్యోగులు ఎవరూ వైసీపీకిచెందినవారు కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలని అన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగులను పీకేయడం ఏంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story

