Thu Mar 19 2026 05:51:15 GMT+0530 (India Standard Time)
పవన్ కామెంట్స్ పై అంబటి హాట్ ట్వీట్
హోంమంత్రి అనితను ఉద్దేశిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

హోంమంత్రి అనితను ఉద్దేశిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. హోం మంత్రికి హోంలోనే (కూటమిలో) అసంతృప్తి మొదలైందని ట్వీట్ చేశారు. దానికి సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను ట్యాగ్ చేశారు.
కూటమి చీలిపోతుందంటూ...
అటు వైసీపీ శ్రేణులు సైతం కూటమి చీలిపోతోందని, అనిత హోంమంత్రిగా విఫలమయ్యారంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. పిఠాపురంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ కామెంట్స్ గా మారాయి. పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా ఆనందంతో ట్వీట్ చేస్తున్నారంటే కూటమిలో అసంతృప్తి మొదలయిందని భావిస్తుండబట్టేనని చెబుతున్నారు.
Next Story

