Fri Mar 20 2026 02:15:11 GMT+0530 (India Standard Time)
Ambati Rambabu : అంబటి రాంబాబు టాలీవుడ్ మీటింగ్ పై సోఫా సెటైర్లు
మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలంగాణలో ప్రభుత్వం, టాలీవుడ్ కు మధ్య జరిగిన చర్చల పై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలంగాణలో ప్రభుత్వం, టాలీవుడ్ కు మధ్య జరిగిన చర్చల పై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పుష్ప 2 సినిమాలో ఘటనలు ఆధారం చేసుకుని ఆయన ఈ ట్వీట్ చేసినట్లు కనిపిస్తుంది. పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పుష్ప 2 సినిమాలో...
పుష్ప 2 సినిమాలో ప్రత్యర్థులను తనకు అనుకూలంగా మలచుకోవడానికి హీరో సోఫా లోపల కోట్ల రూపాయలు చేర్చి బహుమతులుగా పంపుతుంటారు. ఆ సీన్ ను ఇప్పుడు టాలీవుడ్ తో రేవంత్ రెడ్డి చర్చల సందర్భంగా అంబటిరాంబాబు వాడుకున్నట్లు కనిపిస్తుంది. పేర్లు పెట్టకపోయినా కేవలం టాలీవుడ్ సమావేశంపైనే అంబటిరాంబాబు ఈ ట్వీట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

