Thu Jan 29 2026 07:20:11 GMT+0000 (Coordinated Universal Time)
Ambati Rambabu : బాబు హయాంలో ప్రమాదాలే లేవు.. అంబటి ఎద్దేవా
చంద్రబాబు నాయుడు హయాంలో ఎలాంటి ప్రమాదాలు జరగలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడు హయాంలో ఎలాంటి ప్రమాదాలు జరగలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి గత ప్రభుత్వంలో చనిపోయిన వారి లెక్కలు చెప్పారన్నారు. యాజమాన్యాన్ని రక్షించాలని తాము కోరడం లేదన్నారు. క్రైసిస్ మేనేజ్మెంట్ చేతకాక ప్రతిదీ గత ప్రభుత్వం పై నెట్టే ప్రయత్నం చేస్తున్నాన్నారు. ఏది జరిగినా జగన్ మీదకు నెట్టాలని చంద్రబాబు చేసే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు.
శాంతి భద్రతలు...
ఇదే సెజ్ లో చంద్రబాబు హయాంలో ముగ్గురు చనిపోయిన విషయాన్ని అంబటి రాంబాబు గుర్తు చేశారు. పోలీసులంటే నేర్థస్థులకు భయం లేకుండా పోయిందన్నారు. తాడిపత్రిలో దాడులు జరిగితే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. శాంతిభద్రతలు అదుపు తప్పాయని,కానీ వాటిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారన్నారు. ఘటన స్థలికి వెళ్లి రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందని అంబటి రాంబాబు అన్నారు. గోదావరి పుష్కరాల్లో జరిగిన ఘటనను చంద్రబాబు మర్చిపోయినట్లున్నారని అన్నారు.
Next Story

