Thu Mar 19 2026 05:34:21 GMT+0530 (India Standard Time)
మాజీ ఎంపీ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు

మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు తాను బతికి ఉండగా పూర్తి కాదని ఆయన అన్నారు. పోలవరం నిర్మాణ పనులపై శ్వేతపత్రం ప్రకటించాలని ఉండవల్లి డిమండ్ చేశారు. ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సాయం అందివ్వకపోవడానికి కారణాలను కూడా తెలపాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం సరికాదని అన్నారు. డయాఫ్రం వాల్ కూలిపోవడానికి కారణం ఎవరు అని ఆయన ప్రశ్నించారు. కారణాలను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటారా? అని నిలదీశారు.
పోలవరం వల్లనే మునిగిందా?
ఒకరిపై ఒకరు విమర్శించుకుంటారని, కానీ పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, పార్టీలది కాదని ఉండవల్లి అన్నారు. ఒక తప్పు చేయడం వల్ల రెండు వేల కోట్ల రూపాయల భారం పడిందంటే అందుకు కారకులెవరో తేల్చాలన్నారు. డ్యామ్ కట్టకుండానే పోలవరం పూర్తి కాకుండానే భద్రాచలం ఎలా మునిగిపోయిందని ప్రశ్నించారు. పోలవరం మొదలు పెట్టగానే భద్రాచలం మునిగి పోతుందా అని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. పోలవరంలో ఎంత మేర పనులు పూర్తయ్యాయి? ఎంత ఖర్చు చేశారు? కేంద్రం నుంచి రావాల్సిన దెంత? అనే దాని వివరాలను ప్రజలకు వివరించాలని కోరారు.
Next Story

