Fri Dec 05 2025 22:46:42 GMT+0000 (Coordinated Universal Time)
లోకేష్ పాదయాత్రపై జేసీ ఏమన్నారంటే?
లోకేష్ పాదయాత్రపై మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ పాదయాత్రపై మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలకు ఇక కాలం చెల్లిందన్నారు. ఎవరు పాదయాత్రలు చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. పాదయాత్రలు చేసినంత మాత్రాన పార్టీకి అదనంగా ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
ప్రయోజనం లేదన్న...
ఇప్పుడు జరిగేవన్నీ డబ్బుతో కూడిన పాదయాత్రలేనని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అది లోకేష్ చేసినా, రేవంత్ చేసినా ఒక్కటేనని ఆయన అన్నారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సమయంలో జేసీ దివాకర్ రెడ్డి ఇలా మాట్లాడటమేంటని అనంతపురం జిల్లా టీడీపీ నేతలు మండి పడుతున్నారు.
Next Story

