Thu Mar 19 2026 00:16:35 GMT+0530 (India Standard Time)
చంద్రబాబుకు జోగయ్య అల్టిమేటం
మాజీ పార్లమెంటు సభ్యుడు హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ పార్లమెంటు సభ్యుడు హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే తెలుగుదేశం పార్టీకి కాపుల మద్దతు లభిస్తుందని ఆయన అన్నారు. లేకుంటే కాపులు ఆలోచించుకోవాల్సి ఉంటుందని హరిరామ జోగయ్య అన్నారు.
సీఎం అభ్యర్థిగా...
ఇటీవల పవన్ కల్యాణ్, చంద్రబాబుల భేటీపై ఆయన మాట్లాడుతూ అది కేవలం పరామర్శకే పరిమితమయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా కాపుల ఓట్లు కావాలనుకుంటే అది టీడీపీ అత్యాశే అవుతుందని తెలిపారు. వెంటనే దీనిపై చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు.
Next Story

