Thu Mar 19 2026 03:01:08 GMT+0530 (India Standard Time)
మరణాన్ని కూడా లెక్క చేయను
కాపు రిజర్వేషన్ల కోసం మరణాన్ని కూడా లెక్క చేయనని మాజీ పార్లమెంటు సభ్యుడు హరిరామ జోగయ్య స్పష్టం చేశారు.

కాపు రిజర్వేషన్ల కోసం మరణాన్ని కూడా లెక్క చేయనని మాజీ పార్లమెంటు సభ్యుడు హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తాను ఆమరణ దీక్ష చేయబోతున్నట్లు ఆయన మరోసారి ప్రకటించారు. తన మరణం ద్వారానైనా కాపులకు రిజర్వేషన్లు వస్తే చాలునని హరిరామ జోగయ్య అన్నారు.
రేపు పాలకొల్లులో దీక్ష...
రేపు పాలకొల్లులో తన ఆమరణ దీక్షను ప్రారంభించనున్నట్లు హరిరామ జోగయ్య తెలిపారు. పోలీసులు తన దీక్షకు ఇంత వరకూ అనుమతి ఇవ్వలేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని అందుకే తాను దీక్ష చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. తనను అరెస్ట్ చేస్తే అక్కడైనా ఆమరణ దీక్ష చేస్తానని హరిరామ జోగయ్య తెలిపారు.
Next Story

