Sun Mar 08 2026 09:01:48 GMT+0530 (India Standard Time)
Congress : ఏపీకి తిరుపతిని రాజధానిగా చేయాలి
ఏపీకి తిరుపతిని రాజధానిగా చేయాలని మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ అన్నారు

ఏపీకి తిరుపతిని రాజధానిగా చేయాలని మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ అన్నారు. అంతర్జాతీయ ఎయిర్పోర్టు సహా అవసరమైన భూములు, మౌలిక వసతులు తిరుపతిలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తిరుపతిని రాజధానిగా చేస్తే సీమకు న్యాయం జరుగుతుందని చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇండియా కూటమికే...
అన్ని పార్టీలు ఈ ప్రతిపాదనను అంగీకరించాలని చింతా మోహన్ రాజకీయ పార్టీలను కోరారు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని, ఏపీలో గెలవబోయే ఎంపీలందరూ ఇండియా కూటమిలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏపీకి కావాల్సిన వాటిని సాధించుకుందామని కాంగ్రెస్ నేత చింతా మోహన్ పిలుపు నిచ్చారు.
Next Story

