Sun Mar 15 2026 14:49:51 GMT+0530 (India Standard Time)
Pinnelli : పిన్నెల్లి జైలు నుంచి విడుదల
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. కొద్ది సేపటి క్రితం ఆయన జైలు నుంచి విడుదలయి పల్నాడు జిల్లాకు బయలుదేరారు. నిన్న హైకోర్టు బెయిల్ లభించినప్పటికీ న్యాయస్థానం నుంచి పత్రాలు జైలు అధికారులకు అందకపోవడంతో ఆయన నిన్న విడుదల కాలేదు.
జైలు పత్రాలు...
ఈరోజు ఉదయం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి న్యాయవాదులతో పాటు జైలు పత్రాలు కూడా అందడంతో ఆయనను నెల్లూరు జైలు నుంచి విడుదల చేశారు. ఆయనకు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు అక్కడికి తరలి వచ్చారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డి జైలు నుంచి విడుదలయిన పిన్నెల్లితో కాసేపు మాట్లాడారు. ఆ తర్వాత అక్కడి నుంచి పిన్నెల్లి బయలుదేరి వెళ్లిపోయారు.
Next Story

