Wed Mar 18 2026 21:47:54 GMT+0530 (India Standard Time)
Pinnelli : జైలుకు తీసుకెళుతుండగా పిన్నెల్లి ఏం చేశారో తెలుసా?
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయస్థానంలో హాజరుపర్చగా పిన్నెల్లికి పథ్నాలుగు రోజులు రిమాండ్ ను న్యాయమూర్తి విధించారు. ఎన్నికల సందర్భంగా పలు కేసులు నమోదు కావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నరసారావుపేటలో అరెస్ట్ చేశారు.
నెల్లూరు జైలుకు తరలిస్తుండగా....
అయితే ఆయనను నెల్లూరు జైలుకు తరలిస్తుండగా టీడీపీ కార్యకర్త ఒకరు వచ్చి ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు. టీడీపీ కార్యకర్త శివ వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి షేక్ ఇచ్చేందుకు ప్రయత్నించగా శివ పొట్టలో పిన్నెల్లి గుద్దారు. పోలీసుల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే తేరుకున్నపోలీసులు ఆయనను వాహనంలోకి ఎక్కించారు. తనను అరెస్ట్ చేశారన్న ఆనందంతో వచ్చారని, అందుకే పిన్నెల్లి కొట్టారని చెబుతున్నారు. మరోవైపు పిన్నెల్లిని అరెస్ట్ చేయడంతో మాచర్లలో టీడీపీ నేతలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
Next Story

