Fri Dec 05 2025 13:15:35 GMT+0000 (Coordinated Universal Time)
షోకాజ్ నోటీసుపై ఏబీ ఏమన్నారంటే?
ఏపీ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు.

ఏపీ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. తనపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలపై మాత్రమే స్పందించానని చెప్పారు. రూల్ 17 నియామకానికి అనుగుణంగానే తాను మీడియాతో మాట్లాడనని, ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఏబీ వెంకటేశ్వరరావు తన వివరణలో పేర్కొన్నారు. పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేయలేదని మాత్రమే చెప్పానన్నారు.
సర్వీస్ రూల్స్ ప్రకారం....
ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశాన్ని కల్పించారని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తన గౌరవానికి భంగం కలిగించేలా విమర్శలు చేసినందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తాను స్పందించడం ప్రాధమిక హక్కు అని ఆయన పేర్కొన్నారు. తాను మీడియా సమావేశం పెడుతున్నట్లు ముందుగానే ప్రభుత్వానికి తెలిపానని కూడా ఏబీ వెంకటేశ్వరరావు తన వివరణలో పేర్కొన్నారు.
Next Story

