Sun Mar 15 2026 09:19:22 GMT+0530 (India Standard Time)
Vallabhaneni Vamsi : 138 రోజుల తర్వాత వంశీ జైలు నుంచి విడుదల
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేడు జైలు నుంచి విడుదల కానున్నారు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేడు జైలు నుంచి విడుదల కానున్నారు. నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పుడు వల్లభనేని వంశీపై నమోదయిన అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినట్లయింది. వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసుతో పాటు, సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టయి గత నాలుగు నెలల నుంచి విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు.
పదకొండు కేసులు...
138 రోజులుగా వల్లభనేని వంశీ విజయవాడ జైలులోనే ఉన్నారు. వంశీపై పదకొండు కేసులు వరసగా నమోదయ్యాయి. ఒక్కొక్క కేసులో బెయిల్ రావడం, మరొక కేసు నమోదు కావడంతో ఇంత వరకూ బెయిల్ లభించలేదు. ఇప్పుడు అన్ని కేసుల్లో బెయిల్ లభించడంతో వల్లభనేని వంశీ ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.
Next Story

