Sun Mar 15 2026 10:45:03 GMT+0530 (India Standard Time)
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ రేపు ఉదయం విడుదల?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పెద్ద ఊరట లభించింది.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పెద్ద ఊరట లభించింది. నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పుడు వల్లభనేని వంశీపై నమోదయిన అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినట్లయింది. వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసుతో పాటు, సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టయి గత నాలుగు నెలల నుంచి విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు.
వరస కేసుల్లో...
ఒక్కొక్క కేసులో బెయిల్ రావడం, మరొక కేసు నమోదు కావడంతో ఇంత వరకూ బెయిల్ లభించలేదు. ఇప్పుడు అన్ని కేసుల్లో బెయిల్ లభించడంతో వల్లభనేని వంశీ రేపు ఉదయం జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. అయితే మరొక కేసు నమోదు కాకుంటే, పీటీ వారెంట్ పై అరెస్ట్ చేయకుంటేనే ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story

