Sun Dec 14 2025 02:40:23 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : తాను జగన్ వెంటే.. ప్రచారాన్ని నమ్మొద్దన్న వైసీపీ నేత
తాను వైసీపీలోనే కొనసాగుతానని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు

తాను వైసీపీలోనే కొనసాగుతానని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వస్తావం లేదన్నారు. తాను వైఎస్ కుటుంబంతో 35 ఏళ్లుగా నడుస్తున్నానని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు. ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలసి నడుస్తానని తెలిపారు.
సొంత పార్టీ నేతలే...
తనపై ఈ ప్రచారం చేయడం విచారకరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ఉన్నంత వరకూ తాను జగన్ వెంటే ఉంటానని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, తనను నమ్ముకున్న వారి తాను రాజకీయాలు చేస్తున్నానని ఆయన తెలిపారు.
Next Story

