Sat Mar 07 2026 23:19:35 GMT+0530 (India Standard Time)
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా గౌతమ్ సవాంగ్ బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బాధ్యతలను స్వీకరించారు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ బాధ్యతలను స్వీకరించారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఏపీపీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. మొన్నటి వరకూ ఏపీ డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే.
అనుమానాలను....
కొత్త డీజీపీగా రాజేంద్ర నాధ్ రెడ్డి బాధ్యతలను స్వీకరించే సమయంలోనూ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరిస్తారా? లేదా? అన్న సందేహం ఉంది. అయితే అనుమానాలను పటాపంచలు చేస్తూ కొద్దిసేపటి క్రితం గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతలను స్వీకరించారు.
Next Story

