Thu Dec 18 2025 17:53:59 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ వివేకా హత్యపై గౌతమ్ సవాంగ్ ఏమన్నారంటే?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విచారణ విషయంలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని ఆయన తెలిపారు. ఈ హత్య కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, దోషులకు శిక్షపడేలా చేయాలని మాత్రమే జగన్ తమతో చెప్పేవారని నాటి డీజీపీగా తాను దానిని అమలు చేశానని గౌతమ్ సవాంగ్ తెలిపారు.
కొన్ని కథనాలు....
అయితే ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని, కేసు విచారణకు సంబంధించి డీజీపీగా ఉన్నప్పుడు తాను మాట్లాడినట్లు వచ్చిన కథనాల్లో నిజం లేదని గౌతమ్ సవాంగ్ తెలిపారు. తనకు జగన్ ఎప్పుడూ వైఎస్ వివేకానందరెడ్డి, అవినాష్ రెడ్డి రెండు కళ్లులాంటి వారని మాత్రమే చెప్పారని, అదే విషయాన్ని తనను కలసిన సునీత, రాజశేఖర్ రెడ్డికి చెప్పానని ఆయన వివరించారు. తాను ఏనాడూ అవినాష్ రెడ్డి, ఈసీ సురేంద్ర నాధ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలను కలవలేదని ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
Next Story

