Sat Mar 07 2026 23:19:04 GMT+0530 (India Standard Time)
గౌతం సవాంగ్ కు అలా జరగాల్సిందే
మాజీ డీజీపీ గౌతం సవాంగ్ కు తగిన శాస్తి జరిగిందని పీసీఐ నేత నారాయణ అన్నారు

మాజీ డీజీపీ గౌతం సవాంగ్ కు తగిన శాస్తి జరిగిందని పీసీఐ నేత నారాయణ అన్నారు. పాలకులు ఏం చెబితే అది చేస్తే ఇలాంటివే జరగుతాయని నారాయణ అభిప్రాయపడ్డారు. గతంలోనూ ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో ఇలాగే జరిగిందని సీపీఐ నేత నారాయణ గుర్తు చేశారు.
విధేయత చూపిన వారికే.....
ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్ లాంటి వారు జగన్ కు అండగా నిలిచినా వారిని అకస్మాత్తుగా బదిలీ చేశారన్నారు. అదే ఇప్పుడు గౌతం సవాంగ్ విషయంలోనూ జరిగిందని నారాయణ అన్నారు. తప్పులు చేస్తూ ప్రభుత్వం మీద విధేయత చూపించిన వారికి ఇలాగే జరుగుతుందని గౌతం సవాంగ్ విషయంలో మరోసారి స్పష్టమయిందన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ విధినిర్వహణలో రూల్స్ ను పాటించాలని ఆయన కోరారు.
Next Story

