Sun Mar 15 2026 10:24:29 GMT+0530 (India Standard Time)
పోలీసుల కన్నుగప్పి చింతమనేని పరారీ
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. ఆయన కోడిపందేల కేసులో ఇరుక్కున్నారు

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. ఆయన కోడిపందేల కేసులో ఇరుక్కున్నారు. పటాన్ చెరు సమీపంలో ఈ ఘటన జరిగింది. పటాన్ చెర్వు మండలం చినకంజర్ల శివార్లలో కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకుద సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అర్ధరాత్రి దాడులు చేశారు. కోడి పందేలు నిర్వహిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
పందేలను నిర్వహిస్తూ....
పోలీసులు వెళ్లేసరికి అక్కడ 70 మంది వరకూ ఉన్నారు. అయితే విచారణలో కోడిపందేల నిర్వహణలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అక్కినేని సతీష్, కృష్ణంరాజు, శ్రీను ఉన్నారని తేలడంతో వారికోసం వెదుకుతున్నారు. 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతమనేని మాత్రం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story

