Fri Dec 05 2025 12:40:28 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ఎమ్మెల్యే చింతమనేని హౌస్ అరెస్ట్
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనను ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. నిన్న దెందులూరులో తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో పోస్టింగ్ లతో రెండు పార్టీల మధ్య వివాదం చేసుకుంటుంది.
సోషల్ మీడియాలో....
ఈ వివాదం ఘర్షణకు దారితీసింది. వైసీపీ, టీడీపీ వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో దెందులూరు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాలను చెదరగొట్టడానికి ప్రయత్నించిన ఎస్ఐతో సహా పలువురి పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

