Mon Mar 23 2026 10:08:53 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు తాడేపల్లికి వైఎస్ జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి ఉదయం 11.55 గంటలకు వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకోనున్నారు. తర్వాత పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ముఖ్యనేతలతో సమావేశమై...
అందుబాటులో ఉన్న వైసీపీకి చెందిన ముఖ్యనేతలతో సమావేశమై తాజా రాజకీయాలపై చర్చించే అవకాశముంది. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రయివేటు పరం చేసే ఆలోచనలపై పార్టీ పరంగా చేయాల్సిన ఆందోళన, తాను ఎక్కడ పాల్గొనాల్సిందన్న దానిపై జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశముంది. దీంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న అనేక పరిస్థితులపై చర్చించనున్నారు.
Next Story

