Sun Mar 15 2026 12:31:33 GMT+0530 (India Standard Time)
నేడు బెజవాడకు నల్లారి
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు విజయవాడకు చేరుకుంటారు

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు విజయవాడకు చేరుకుంటారు. బీజేపీలో చేరిన అనంతరం ఆయన తొలిసారిగా విజయవాడ వస్తున్నారు దీంతో స్వాగతం పలికేందుకు బిజెపి శ్రేణులు పెద్దయెత్తున విజయవాడ చేరుకుంటున్నాయి. ఈరోజు 12గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు.
రాజకీయ పరిణామాలపై...
అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై ఆయన మాట్లాడే అవకాశముంది. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశమైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ రాజకీయాలలో ఎలాంటి పాత్ర పోషిస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Next Story

