Wed Dec 17 2025 12:53:36 GMT+0000 (Coordinated Universal Time)
జనం తరుపున నేను బిడ్ వేస్తా
విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ప్రజల తరుపున తాను బిడ్ వేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు

విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ప్రజల తరుపున తాను బిడ్ వేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట ప్రయివేటీకరణ జరగకుండా కాపాడేందుకు సమిష్టి పోరాటం చేయాలని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద తాము కూడా భాగస్వామ్యులవుతామని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ప్రయివేటీకరణ ఎలా జరుగుతుందో చూస్తామని ఆయన హెచ్చరించారు. మధ్యాహ్నం మూడు గంటలలోపు తాము బిడ్స్ వేస్తామని ఆయన తెలిపారు.
నిరసన ర్యాలీ...
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగి తీరుతుందన్న కేంద్రం ప్రకటనతో విశాఖ కూర్మన్నపాలెం నుంచి కార్మికులు పాదయాత్ర ప్రారంభించారు. కార్మికులు, కుటుంబసభ్యులు, నిర్వాసితులు సింహాచలానికి బయల్దేరారు. కేంద్రం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తుందని, దిగి వచ్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఈ యాత్రలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని తన మద్దతు తెలిపారు.
Next Story

