Tue Mar 17 2026 04:14:06 GMT+0530 (India Standard Time)
నేను వైసీపీలో చేరడం లేదు
తాను వైసీపీలో చేరడం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మ్మీనారాయణ తెలిపారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు

తాను వైసీపీలో చేరడం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మ్మీనారాయణ తెలిపారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను ఒక కార్యక్రమంలో నాడు - నేడు, ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని అభినందించిన మాట వాస్తవమేనని, అంత మాత్రాన తాను వైసీపీలో చేరుతున్నానని ప్రచారం చేయడం తగదని ఆయన పేర్కొన్నారు.
అభినందింనంత మాత్రాన...
ఇటీవల లక్ష్మీనారాయణ ఆయన చదువుకున్న స్కూలులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు - నేడు, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలపై స్పందించారు. వీటిని మంచి కార్యక్రమాలుగా పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత లక్ష్మీనారాయణ వైసీపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దానిని ఆయన కొట్టిపారేశారు.
Next Story

