Sun Mar 22 2026 01:41:26 GMT+0530 (India Standard Time)
వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తా
వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు

వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు కాని విశాఖపట్నం పార్లమెంటు ఎన్నికలకు తాను అభ్యర్థిగా బరిలో ఉంటానని తెలిపారు.
ఇండిపెండెంట్ గా నైనా...
తన ఆలోచనలకు అనుకూలమైన పార్టీ అవకాశమిస్తే పోటీ చేస్తానని, లేకుంటే ప్రజాస్వామ్యంలో కల్పించిన హక్కుతో తాను స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్ ను కాలమే నిర్ణయిస్తుందన్న జేడీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో ప్రజలకు తనకు మద్దతిస్తారని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story

