Thu Mar 19 2026 11:33:24 GMT+0530 (India Standard Time)
సమావేశాలకు కన్నా దూరం
బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు గైర్హాజరయ్యారు

బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు గైర్హాజరయ్యారు. భీమవరంలో జరుగుతున్న ఈ కార్కక్రమానికి కన్నా లక్ష్మీనారాయణ దూరంగా ఉండటం పార్టీలో చర్చనీయాంశమైంది. ఆయన తిరుమలలో కుటుంబ సభ్యులతో ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరతారన్న ప్రచారం ఉపందుకున్న నేపథ్యంలో ఆయన గైర్హాజరీ హాట్ టాపిక్ గా మారింది.
నేడు రాజీనామాలు?
అయితే గత కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై విమర్శలు చేయడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు నేడు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. పల్నాడు జిల్లా పెదకూరపాడులోనూ బీజేపీ నేతల సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కన్నా అనుచరులు పార్టీలోని తమ పదవులకు రాజీనామా చేస్తారని చెబుతున్నారు.
Next Story

