Sun Mar 15 2026 04:44:48 GMT+0530 (India Standard Time)
దిక్కుమాలిన ప్రభుత్వమిది
వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. నిరాహార దీక్షలు సంవత్సరం చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అమరావతి రైతులు ఎన్ని రోజులు దీక్షలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన చీడ ఈ ప్రభుత్వమని ఆయన అన్నారు. ఒక్కసారి ఎన్నుకున్నందుకు ప్రజలకు కూడా బుద్ధి వచ్చిందన్నారు.
అదానీకి దోచి పెడతారా?
2024లో జరిగే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. చివరకు ఎస్సీ, ఎస్టీ నిధులను కూడా దారి మళ్లించారన్నారు. పీకల్లోతు అప్పుల్లో ఉన్న అదానీకి అదనంగా మరో అరవై ఎకరాలు ఎందుకు కేటాయించవలసి వస్తుందో చెప్పాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. అదానీ మీద జగన్ కు అంత ప్రేమ ఎందుకో అర్థం కావడం లేదన్నారు. కృష్ణపట్నం, గంగవరం పోర్టులను జగన్ దోచి పెట్టారని మండి పడ్డారు.
Next Story

