Sun Mar 15 2026 04:43:20 GMT+0530 (India Standard Time)
జగన్ కు ఆ దిక్కుమాలిన సలహాలిస్తుందెవరో?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, జగన్ కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత పోలిక ఉందన్నారు. జగన్ కు ఆ దిక్కుమాలిన సలహాలు ఇచ్చేది ఎవరో చెప్పాలని ఆయన ఎద్దేవా చేశారు. లే అవుట్లలో జగన్ కు ఐదు శాతం స్థలాన్ని ఎందుకు ఇవ్వాలని విష్ణు కుమార్ రాజు ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి జగన్ రౌడీ మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రౌడీ మామూళ్లు....
ఈ పథకానికి జగనన్న రౌడీ మామూళ్లు అని పేరు పెట్టుకుంటే మంచిదని విష్ణు కుమార్ రాజు ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం ప్రజలను దోపిడీ చేయడానికే వచ్చినట్లుందని ఆయన అన్నారు. జగన్ ఓటు బ్యాంకు రాజకీయాలు తప్పించి మరే అభివృద్ధి పనులను చేయలేకపోతున్నారని విష్ణు కుమార్ రాజు ఫైర్ అయ్యారు.
Next Story

