Fri Dec 05 2025 15:26:39 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీలో కన్నా చేరిక ఎప్పుడంటే?
మాజీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.

మాజీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఈ నెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారయింది. చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరనున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
చంద్రబాబు సమక్షంలో...
తన అనుచరులతో ఇప్పటకే సమావేశాలు నిర్వహించిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకే సిద్ధమయ్యారు. గుంటూరు నుంచి ఆయన భారీ ర్యాలీతో రానున్నారని తెలిసింది. ఆయన వచ్చే ఎన్నికలలో గుంటూరు పశ్చిమ లేదా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశముందని అనుచరులు ఇప్పటికే చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో బలహీనంగా ఉన్న పార్టీ కన్నా చేరికతో బలోపేతం అవుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
Next Story

