Sun Mar 15 2026 18:02:06 GMT+0530 (India Standard Time)
అపోలో ఆసుపత్రిలో కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీలో రాళ్లు చేరి బాధపడుతుండటంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మూడు రోజుల క్రితమే కొడాలి నాని అపోలో ఆసుపత్రిలో చేరారని, నిన్న ఆయనకు శస్త్ర చికిత్స జరిగినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
కిడ్నీలో రాళ్లు చేరి...
కొడాలి నాని ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిందని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో కొడాలి నాని చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుట పడాలని కొడాలి నాని అభిమానులు, వైసీపీ కార్యకర్తలు గుడివాడలో ప్రార్థనలు జరుపుతున్నారు.
Next Story

