Sat Jan 18 2025 03:36:28 GMT+0000 (Coordinated Universal Time)
మీడియా ముందుకు ఏబీ వెంకటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఈరోజు మీడియా ఎదుటకు రానున్నారు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఈరోజు మీడియా ఎదుటకు రానున్నారు. ఆయన పెగాసస్ స్పై వేర్ పై మాట్లాడే అవకాశముందని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆయన పై గతంలోనూ కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది కూడా.
ఫోర్జరీ వ్యవహారంపై...
అయితే ప్రస్తుతం ఏపీలో పెగాసస్ స్పై వేర్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది. ఆయనపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. తనపై నమోదయిన కేసులకు సంబంధించి దాఖలు చేసిన పత్రాలను ఫోర్జరీ చేశారని ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడే అవకాశముంది.
Next Story