Tue Mar 31 2026 04:32:36 GMT+0530 (India Standard Time)
హరిచందన్ కు ఆత్మీయ వీడ్కోలు
ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు గన్నవరం విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు

ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు గన్నవరం విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ దంపతులకు స్వయంగా వీడ్కోలు పలికారు. బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌ఘడ్ గవర్నర్ గా బదిలీ అయి వెళుతుండటంతో ఆయన కు వీడ్కోలు పలికేందుకు జగన్ విమానాశ్రయానికి వచ్చారు.
ఉన్నతాధికారులు...
ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ కె మోషేన్ రాజు, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Next Story

