Sat Mar 07 2026 20:28:14 GMT+0530 (India Standard Time)
రఘురామ కేసులో విజయపాల్ అరెస్ట్
రఘురామరాజు కస్టోడియల్ విచారణ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

రఘురామరాజు కస్టోడియల్ విచారణ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న బెయిల్ నిరాకరించడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు చూపారు. బెయిల్ రాకపోవడంతో విజయపాల్ ప్రకాశం ఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ తర్వాత విజయ్‌పాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత ఆయనను గుంటూరుకు తరలించారు.
రఘురామ కేసులో...
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న సీఐడీ రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ ఆర్. విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విజయ్‌పాల్ మంగళవారం ఉదయం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి విచారించిన పోలీసులు, రాత్రి 9 గంటల సమయంలో విజయ్‌పాల్‌ని అరెస్టు చేశారు.
Next Story

