Fri Mar 20 2026 21:58:21 GMT+0530 (India Standard Time)
తారకరత్న హెల్త్ అప్డేట్
గుండెపోటుతో అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరిన తారకరత్నకు విదేశీ వైద్యులు చికిత్సను అందిస్తున్నారు

గుండెపోటుతో అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరిన తారకరత్నకు విదేశీ వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఆయనకు ప్రతి రోజూ పరీక్షలు నిర్వహిస్తూ అందుకు అనుగుణంగా చికిత్స నిర్వహిస్తున్నట్లు నందమూరి రామకృష్ణ తెలిపారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన చెబుతున్నారు.
విదేశీ వైద్యులతో...
గత నెల 27వ తేదీన లోకేష్ పాదయాత్ర ప్రారంభానికి కుప్పం వెళ్లిన తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుండెతో పాటు న్యూరో సమస్యలకు విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Next Story

