Fri Dec 05 2025 20:43:36 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : షర్మిలతో గొడవ విషయంపై జగన్ ఏమన్నారంటే?
వైఎస్ షర్మిలతో తన కుటుంబంలో తలెత్తిన విభేదాలపై జగన్ తొలిసారి స్పందించారు

వైఎస్ జగన్ తన చెల్లెలు షర్మిలకు సంబంధించిన గొడవపై తొలిసారి స్పందించారు. కుటుంబ విషయాలను కొన్ని అనుకూల మీడియా సంస్థలు హైలెట్ చేస్తున్నాయని అన్నారు. గొర్ల గ్రామంలో బాధితులను పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ కుటుంబంలో గొడవలు ఉండవని ఆయన ప్రశ్నించారు.
ప్రతి కుటుంబంలో...
ప్రతి కుటుంబంలో ఉండే సాధారణ గొడవలే తమ కుటుంబంలోనూ చోటు చేసుకున్నాయని తెలిపారు. అంత మాత్రాన కుటుంబ గొడవలను పదే పదే హైలెట్స్ చేస్తూ సమస్యలను పక్క దోవ పట్టించడానికి ఈ ప్రభుత్వం తన అనుకూల మీడియాను ఉపయోగించుకుంటుందని వైఎస్ జగన్ ఆరోపించారు. దీని వల్ల తనకు ప్రత్యేకంగా జరిగే నష్టమేమీ లేదన్నారు. వారి కుటుంబాల్లో కూడా గొడవలున్నాయని, కానీ అవి వాటికి బయటకు చెప్పుకోలేరని అన్నారు.
Next Story

