Sun Mar 15 2026 22:11:55 GMT+0530 (India Standard Time)
మండలిలో అనంతబాబు
చాలా రోజుల తర్వాత తొలిసారి శానసమండలికి ఎమ్మెల్సీ అనంతబాబు హాజరయ్యారు

చాలా రోజుల తర్వాత తొలిసారి శానసమండలికి ఎమ్మెల్సీ అనంతబాబు హాజరయ్యారు. కాకినాడలో జరిగిన డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు రాజమండ్రి జైలులో శిక్ష అనుభవించి బెయిల్పై బయటకు వచ్చారు. హత్య అనంతరం అనంతబాబును వైసీపీ పార్టీ నుంచి సప్పెండ్ చేసింది.
పార్టీ సస్పెండ్ చేసినా...
అయితే ఆయన శాసమండలి సభ్యుడిగానే కొనసాగుతున్నారు. దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కిరాతకంగా హత్య చేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయితే నిన్నటి నుంచే శాసనమండలికి ఆయన హాజరవుతున్నారు. చాలా రోజుల తర్వాత ఆయన మండలికి రావడంతో అనంతబాబును అనేక మంది నేతలు పరామర్శించారు.
Next Story

