Sun Mar 15 2026 09:34:24 GMT+0530 (India Standard Time)
Srisailam : శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద నీరు
శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద నీరు కొనసాగుతుంది.

శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద నీరు కొనసాగుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయం ఇప్పటికే నిండుకుండలా మారింది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన మూడు గేట్లు 10 అడుగులమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 57,690 క్యూసెక్కులుగా ఉంది.
జలవిద్యుత్తు...
శ్రీశైలం ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 1,48,954 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుప్రస్తుత నీటిమట్టం 884 అడుగులు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 210.03 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టులో కుడి, ఎడమల జలవిద్యుత్తు కేంద్రా్లలో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Next Story

