Fri Dec 05 2025 10:49:57 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీశైలం జలాశయానికి వరద నీరు
శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది.

శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు జూరాల ప్రాజెక్టు నుంచి పది గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతుంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ప్రాజెక్టులోకి 1.49 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా ఉండగా, అవుట్ ఫ్లో 1.22 లక్షల క్యూ సెక్కులుగా ఉంది.
సాగర్ కు నీటి విడుదల...
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగాప్రస్తుత నీటి మట్టం 883.30 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం కుడి, ఎడమ విద్యుత్తు కేంద్రాల నుంచి నిరంతరాయంగా విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుంది. కాగా శ్రీశైలం జలాశయంనీటి సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202. 9673 టీఎంసీల వద్ద నిలిచింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1.22 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Next Story

