Fri Dec 05 2025 09:05:28 GMT+0000 (Coordinated Universal Time)
Srisailam : శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు
శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది

శ్రీశైలం జలాశయానికి వదర నీరు వచ్చి చేరుతుంది. దీంతో దిగువకు నీటిని నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు. అయితే గతంలో పోలిస్తే నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం జలాశయానికి 90,788 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1,03,426 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. జలాశయంలో 215.8 టీఎంసీల పూర్తి సామర్థ్యం కాగా 211.96 టీఎంసీలు నీరు నిల్వగా ఉంది.
విద్యుత్తు ఉత్పత్తి...
జూరాల ప్రాజెక్టుకు 1,23,008 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1,24,617 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సుంకేసుల బరేజ్ నుంచి నదిలోకి 9,155 క్యూసెక్కుల స్వల్ప నీటిని వదులుతున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ద్వారా 30,944 క్యూసెక్కులు, తెలంగాణవిద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రెండు కేంద్రాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
Next Story

