Fri Dec 05 2025 14:24:47 GMT+0000 (Coordinated Universal Time)
Srisailam : శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టుకు చెందిన పది గేట్లను పద్దెనిమిది అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు

శ్రీశైలం ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టుకు చెందిన పది గేట్లను పద్దెనిమిది అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రస్తుతం ఇన్ ఫ్లో 4,71,386 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 5,05,150 క్యూసెక్కులుగా ఉందని చెప్పారు.
పది గేట్లు ఎత్తి...
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 881.50 అడుగులుగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 196.11 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
Next Story

