Tue Jan 20 2026 06:38:44 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో మరోసారి అపచారం
ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల పైనుంచి విమానాలు వెళ్లకూడదనే వాదన ఉంది. తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్

తిరుమల కొండపై మరోసారి అపచారం జరిగింది. తిరుమల పై నుంచి విమానం వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయం పై నుంచి మహాగోపురం మీదుగా విమానం వెళ్లినట్టుగా భక్తులు చెబుతున్నారు.
ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల పైనుంచి విమానాలు వెళ్లకూడదనే వాదన ఉంది. తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్ పరిధిలోకి తేవాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా తిరుమల కొండపై తరుచుగా విమానాలు వెళ్తున్నాయి. తిరుమల కొండ గగనతలంపై నుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకమని టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. టీటీడీ అభ్యంతరాలను విమానయాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
గత కొంత కాలంగా తిరుమల కొండపై తరుచూ విమానాలు వెళుతున్నాయి. ఆగమ నిబంధనలకు వ్యతిరేకమని తిరుమల తిరుపతి దేవస్థానం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. విమానయాన శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. తరుచూ ఆలయంపై విమానాలు వెళ్తుండటంపై శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story

