Tue Jul 15 2025 16:31:53 GMT+0000 (Coordinated Universal Time)
Ananthapuram : అనంతపురంలో ఫ్లెక్సీల రగడ.. భూ కబ్జాలంటూ?
అనంతపురంలో ఫ్లెక్సీలు టీడీపీ నేతల ఆగ్రహానికి కారణమయింది.

అనంతపురంలో ఫ్లెక్సీలు టీడీపీ నేతల ఆగ్రహానికి కారణమయింది. నిర్వాహకులు, టీడీపీ నేతల మధ్య వివాదం తలెత్తింది. మాజీ మంత్రి పల్లె రఘునాధరెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అనంతపురంలో జరుగుతున్న యాదవ కల్యాణ మండపంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పల్లె రఘునాధరెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి.
పోలీసులు వచ్చి...
అయితే దీనిపై టీడీపీ నేతలు ఆ ఫ్లెక్సీలను కల్యాణమండపంలో తొలగించాలని నినాదాలు చేశారు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీని వెనక వైసీపీ నేతల హస్తం ఉండి ఉంటుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వివాదం పెద్దది అవుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ఇరు వర్గాల నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
Next Story