Fri Jan 09 2026 05:48:51 GMT+0000 (Coordinated Universal Time)
కోనసీమలో ఆరని మంటలు
కోనసీమ జిల్లా ఇరుసుమండలో వరుసగా నాలుగో రోజూ మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి

కోనసీమ జిల్లా ఇరుసుమండలో వరుసగా నాలుగో రోజూ మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. బ్లోఅవుట్లో ఇంకా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. గత మూడు రోజుల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా మంటలు అదుపులోకి రాలేదు. వాటర్ అంబ్రెల్లా ద్వారా నిరంతరం నీటిని నిపుణుల బృందంవిరజిమ్ముతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు.
మరికొన్ని రోజులు...
మరొక మూడు రోజుల పాటు మంటలు ఎగిసిపడే అవకాశముందని అధికారులు తెలిపారు. శకలాలు తొలగించేందుకు నిపుణుల బృందం ప్రయత్నాలు చేస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఓఎన్జీసీC ప్రత్యేక అధికారి విక్రమ్ సక్సేనా ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మంటలార్పేందుకు మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
Next Story

